ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది.. అదే నా జీవితాన్ని మార్చేసింది

ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది.. అదే నా జీవితాన్ని మార్చేసింది

నటి కిరణ్ రాథోడ్(Kiran rathod) దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించనుంది. ఆమె తాజాగా తమిళంలో విజయ్(Vijay) హీరోగా వస్తున్న లియో(Leo) సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.

నేను కెరీర్ స్టార్టింగ్ లో ఒకరిని ప్రేమించాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. ఆ తప్పు చేయకపోయుంటే నా జీవితం  ఇంకోలా ఉండేది. ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యేదాన్నీ కాదు. కావాలని కొంతమంది నన్ను ఇండస్ట్రీకి దూరం చేశారు. కానీ.. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌లో ఉంటాను. నా లేటెస్ట్ ఫోటో షూట్స్ అన్నీ అక్కడ షేర్ చేస్తాను. కానీ ఆ ఫోటోలు చూసి కొంతమంది నీ రేటెంత? అని అడుగుతరు. అలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ప్రస్తుతం నేను విజయ్ సర్ లియో సినిమాలో నటిస్తున్నాను. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత నాకు మంచి ఆఫర్స్ వస్తాయని నమ్ముతున్నాను అని కిరణ్‌ రాథోడ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

ALSO READ : మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ .. ముగ్గురికి ఛాన్స్

 
ఇక కిరణ్‌ రాథోడ్‌ విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్ లో యాది అనే సినిమాతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తరువాత తెలుగులో నువ్వులేక నేను లేను, జెమిని వంటి సినిమాల్లో నటించింది. ఇక చివరగా ఆమె 2016లో వచ్చిన ఇలమై ఊంజల్‌ అనే తమిళ సినిమాలో నటించింది.