మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ .. ముగ్గురికి ఛాన్స్

మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ .. ముగ్గురికి ఛాన్స్

మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్  2023 ఆగస్టు 26న తన మంత్రివర్గాన్ని విస్తరించారు.  భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో ఉదయం 8:45 గంటలకు కొత్తగా ముగ్గురు (రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ సింగ్ లోధీ) మంత్రులుగా  ప్రమాణస్వీకారం చేశారు.  ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి  ఎన్నికలకు జరగనున్నాయి. ఈ క్రమంలో  కేబినెట్ విస్తరణ జరగడం విశేషం. 

రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ చూస్తోందని, పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రివర్గ విస్తరణ ఒక ఎత్తుగడగా భావిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.  మధ్యప్రదేశ్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా 33 మంది మంత్రులు ఉన్నారు. కేబినెట్ గరిష్ఠ బలం 36. తాజాగా  ముగ్గురు కొత్త మంత్రుల చేరికతో మంత్రివర్గం బలం 36 కు చేరుకుంది.  చివరి మంత్రివర్గ విస్తరణ జనవరి 2021లో జరిగింది. 

ALSO READ : ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది.. అదే నా జీవితాన్ని మార్చేసింది

మధ్యప్రదేశ్‌లో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఇటీవల తెలంగాణలోనూ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ  పట్నం మహేందర్ రెడ్డిని తన కేబినేట్ లోకి తీసుకుని మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈ ఏడాది నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.