మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలో సమంత

మోస్ట్ పాపులర్ హీరోయిన్ జాబితాలో సమంత

టాలెంట్ ఉన్నవారిని ఎవ్వరూ ఆపలేరు అంటారు. అది ముమ్మాటికీ నిజమేననడానికి సమంతయే పెద్ద ఉదాహరణ. ఎన్ని వివాదాలు చుట్టుముట్టనీ, ఎవరు ఏమైనా అననీ.. ఆగకుండా జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడులో దూసుకుపోతూనే ఉంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ సంస్థ మన దేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటూ ఓ సర్వే నిర్వహించింది. అందులో ఫస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచింది సమంత. తర్వాతి నాలుగు స్థానాల్లో ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొనె, కాజల్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు. ఆ తర్వాత వరుసగా కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక, పూజా హెగ్డే, అనుష్కా శెట్టిలకు చోటు దక్కింది. దాన్ని బట్టి సమంతకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రూవ్ అవుతోంది. ఇక బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సమంత పేరు మార్మోగుతోంది. త్వరలో ఆమె కరణ్ జోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో కనిపించబోతోంది. ఆల్రెడీ షూట్ పూర్తయ్యిందని, ఎపిసోడ్ జులైలో టెలికాస్ట్ అవుతుందని అంటున్నారు. అలాగే హిందీలో ఒక వెబ్ సిరీస్ చేస్తోందామె. తాప్సీ ప్రొడ్యూస్ చేయబోయే ఫిమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటించబోతోంది. ఇక రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్ సినిమా కోసం కూడా సమంతను అడిగినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే సల్మాన్ హీరోగా అనీజ్ బజ్మీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘నో ఎంట్రీ’ మూవీ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశారు. ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సమంతని ఫిక్స్ చేశారంటూ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వార్తలు అందుతున్నాయి. ఇవన్నీ చూసి దటీజ్ సమంత అంటూ ఆమె ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనందంలో మునిగి తేలుతున్నారు.