నాకు కొవిడ్.. ఇకనైనా సెట్ లో మాస్క్ పెట్టుకునేలా పట్టుబట్టాలి

నాకు కొవిడ్.. ఇకనైనా సెట్ లో మాస్క్ పెట్టుకునేలా పట్టుబట్టాలి

నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ట్విట్టర్లో ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె..కరోనా లక్షణాలు కనిపించగా టెస్టు చేసుకోవడంతో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. రీసెంట్ గా తనను కలిసిన వారు జాగ్రత్తగా ఉండాలని..అవసరమైతే కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు. దయచేసి అందరూ మాస్క్ పెట్టుకోవాలని కోరారు.  సెట్ లో నటీనటులు అన్ని సమయాల్లో మాస్క్ పెట్టుకోవడం కుదరదని.. చూట్టూ ఉన్న వాళ్లైనా మాస్క్ పెట్టుకునేలా అందరూ పట్టుబట్టాలని అన్నారు.  ప్రస్తుతానికి వరలక్ష్మి, బాలయ్య 107, యశోద,శబరి మూవీల్లో నటిస్తున్నారు.