డబ్బు వేటలో అదానీ క్యాపిటల్

డబ్బు వేటలో అదానీ క్యాపిటల్

ముంబై: అదానీ గ్రూప్​లోని ఎన్​బీఎఫ్​సీ కంపెనీ అదానీ క్యాపిటల్​ రూ. 1,500 కోట్లను స్ట్రేటజిక్​, ప్రైవేట్​ ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సేకరించాలని ప్లాన్​ చేస్తోంది. ఎంఎస్​ఎంఈ గ్రోత్​, రూరల్​ డెవలప్​మెంట్ పై ఈ కంపెనీ ఫోకస్​ పెడుతోంది. కొన్ని ప్రైవేట్​ ఈక్విటీ ఫండ్స్​ అదానీ క్యాపిటల్​లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తితో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవెండస్​ క్యాపిటల్​ను ఈ డీల్​ కోసం అదానీ క్యాపిటల్​ నియమించుకున్నట్లు పేర్కొన్నాయి.

కంపెనీలోని 90 శాతం ఈక్విటీ అదానీ గ్రూప్​ చేతిలో ఉండగా, మిగిలిన 10 శాతం మేనేజ్​మెంట్​ టీమ్ చేతిలో ఉంది. రాబోయే రెండు, మూడేళ్లలో ఎసెట్స్​ అండర్​ మేనేజ్​మెంట్​ (ఏయూఎం) సైజును రూ. 10 వేల కోట్ల నుంచి రూ. 12 వేల కోట్లకు పెంచుకోవాలనేది అదానీ క్యాపిటల్​ ఆలోచనగా వివరించాయి. మార్చి 2023 నాటికి ఈ కంపెనీ ఏయూఎం రూ. 3,977 కోట్లు. అదానీ క్యాపిటల్​ నుంచి అదానీ గ్రూప్​ వైదొలగనుందనేవి రూమర్లేనని అదానీ గ్రూప్​ స్పోక్స్​పర్సన్​ స్పష్టం చేశారు.