హరీశ్ రావు.. బ్లాక్ మెయిల్ రావు : ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

హరీశ్ రావు.. బ్లాక్ మెయిల్ రావు :  ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
  •     ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, వెలుగు: హరీశ్ రావు.. బ్లాక్ మెయిల్ రావు అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్​లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీశ్ రావుదన్నారు. సొంత మామ కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యారని ఆరోపించారు. 

2021లోనే నాదర్‌‌గుల్ భూములను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధం లేని అంశాల్లో ఆయనతోపాటు ఆయన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్​ అయ్యారు.