జూన్ 3న ఆదివాసీ పోరుకేక.. పాకాల కొత్తగూడెంలో బహిరంగ సభ

జూన్ 3న ఆదివాసీ పోరుకేక.. పాకాల కొత్తగూడెంలో బహిరంగ సభ

ఉప్పల్, వెలుగు: ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం జూన్ 3న పాకాల కొత్తగూడెంలో నిర్వహించనున్న ‘ఆదివాసీ పోరుకేక’ బహిరంగ సభ కరపత్రాన్ని ఆదివారం ఓయూలో ఆవిష్కరించారు. ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగబోయిన పాపారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన లక్ష్మినారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల సాధన కోసం జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.