ఆపరేషన్ కంగార్ ను వెంటనే ఆపాలి: ప్రొ. హరగోపాల్

ఆపరేషన్ కంగార్ ను వెంటనే ఆపాలి: ప్రొ. హరగోపాల్
  • ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక

బషీర్ బాగ్, వెలుగు: ఛత్తీస్​గఢ్​దండకారణ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కంగార్ ను వెంటనే ఆపాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక ప్రతినిధి ప్రొఫెసర్​హరగోపాల్ మాట్లాడుతూ.. మధ్య భారతదేశంలో 10 నెలలుగా కొనసాగుతున్న ఆదివాసీ హత్యాకాండ మరింత తీవ్రమైందన్నారు. 

ఛత్తీస్​గఢ్, అబూజ్ మాడ్, తెల్తులి, నెండూరు అటవీ ప్రాంతాల్లో ఈ నెల 4న భద్రతా దళాలు అమాయక ఆదివాసీలను చంపేశాయని, తర్వాత ఎన్​కౌంటర్​గా ప్రకటించాయని మండిపడ్డారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను చంపారని ఆరోపించారు. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందని మండిపడ్డారు.

 4న జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్​చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని కోరుతూ నవంబర్ 3న ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.