మోడల్​ స్కూల్స్​‌లో అడ్మిషన్స్​కు ప్రవేశాలు

మోడల్​ స్కూల్స్​‌లో అడ్మిషన్స్​కు ప్రవేశాలు

మోడల్​ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్​ 15 నుంచి అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం కానుంది.  ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ జూన్‌లో నిర్వహిస్తారు.

రాష్ర్టవ్యాప్తంగా ఉన్న మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఒక్కో స్కూల్‍లో వంద సీట్ల చొప్పున ఆరోతరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. మిగిలిన తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రవేశాలుంటాయి. ఇందులో చేరిన స్టూడెంట్స్​కు ఎలాంటి ఫీజు ఉండదు. ఉచితి వసతితో పాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అందిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏ, సీపీటీ, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకూ శిక్షణ ఇస్తారు. 

అర్హతలు: ఆరో తరగతిలో చేరేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్​ నుంచి ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
వయసు: ఆరో తరగతికి స్టూడెంట్​ వయసు 10 ఏళ్లు నిండి ఉండాలి. ఏడుకు 11, ఎనిమిదికి 12, తొమ్మిదికి 13, పదికి 14 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 
సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రెన్స్​లో స్టూడెంట్​ చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్​ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తారు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​
ఆరోతరగతి ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు వంద ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ఉంటుంది. ఆరోతరగతి పేపర్‌లో తెలుగు, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్(సైన్స్ &సోషల్), ఇంగ్లిష్ నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశించే స్టూడెంట్స్​కు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్​లలో ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఆబ్జెక్టివ్‍ విధానంలో ఉండే ఈ ఎగ్జామ్​ డ్యురేషన్​ రెండు గంటలు. 

ఆరోతరగతి ఎంట్రెన్స్​
సబ్జెక్ట్​           ప్రశ్నలు    మార్క్స్​
తెలుగు           25         25
మ్యాథమెటిక్స్   25         25
సైన్స్ & సోషల్‍  25         25
ఇంగ్లిష్‍             25         25
మొత్తం           100       100
 

7 నుంచి 10వ తరగతి
సబ్జెక్ట్​           ప్రశ్నలు      మార్క్స్​
ఇంగ్లిష్‍            25           25
మ్యాథమెటిక్స్   25           25
జనరల్‍ సైన్స్    25           25
సోషల్‍ స్టడీస్‍    25           25
మొత్తం           100        100

ముఖ్య సమాచారం
6వ తరగతి అప్లికేషన్లు: ఏప్రిల్​ 15 నుంచి 30 వరకు
7 నుంచి 10 తరగతులకు: ఏప్రిల్​ 20 నుంచి 30 వరకు
అప్లికేషన్​ ఫీజు: జనరల్​ స్టూడెంట్స్​కు రూ.150, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్​కు రూ.75
హాల్​టికెట్ల డౌన్​లోడ్​: జూన్​ 1 నుంచి జూన్​ 6 వరకు
ఆరో తరగతి ఎంట్రెన్స్​: జూన్​ 6
7 నుంచి 10 తరగతుల ఎంట్రెన్స్​: జూన్​ 5
ఫలితాల ప్రకటన: జూన్​ 14
మెరిట్​ లిస్ట్​ విడుదల: జూన్​ 17
సర్టిఫికెట్ల వెరిఫికేషన్​, ప్రవేశాలు: జూన్18 నుంచి జూన్​ 20 వరకు
తరగతులు ప్రారంభం: జూన్​ 21
వెబ్‌సైట్‍: www.telanganams.cgg.gov.in