అంబర్పేట్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాన్ని రద్దు చేసి, 5వ షెడ్యూల్లో ఉన్న భూభాగాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు హెచ్చరించారు. అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు.
అదే జరిగితే ఆదివాసి గిరిజనులంతా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గురువారం అంబర్‌పేటలో నిర్వకహించిన గిరిజనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సంపద ఆదివాసి గిరిజనులకు మాత్రమే దక్కాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లకొండ సుధాకర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
