యాలాలో యాలాలో.. ప్రేముంది గుండెల్లో.. రవితేజ ఇరుముడి నుంచి రెండో సాంగ్ రిలీజ్

యాలాలో యాలాలో.. ప్రేముంది గుండెల్లో.. రవితేజ ఇరుముడి నుంచి రెండో సాంగ్ రిలీజ్

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రవితేజకు జంటగా ప్రియా భవాని శంకర్, కూతురుగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. ఇప్పటికే ‘ఇరుముడి కట్టు’ అనే భక్తి పాటతో ప్రమోషన్‌‌‌‌లో జోష్‌‌‌‌ పెంచిన మేకర్స్‌‌‌‌.. తాజాగా ‘యాలాలో యాలాలో’ అనే రెండో పాటను విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ సాఫ్ట్ మెలోడీ సాంగ్‌‌‌‌ను హెషామ్ అబ్దుల్ వహాబ్, సాధికా కెఆర్ ఆలపించిన తీరు ఆకట్టుకుంది.

‘‘అమ్మతో దాపరికం, నాన్నతో రాచరికం, మా ఇంటి  ప్రేమరికం.. చూడాలి ఈ లోకం.. కొండతో చుట్టరికం, కోనతో ఇల్లరికం, లేదు ఏ పేదరికం, మాతోనే మాలోకం.. యాలా యాలో ఏముంది మేడల్లో యాలో.. ఏముంది కాసుల్లో యాలో.. ప్రేముంది గుండెల్లో..” అంటూ మధ్యతరగతి కుటుంబానికి ప్రేమానురాగాలే అసలైన సిరి సంపదలు అని ఫీల్ వచ్చేలా  అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం హృదయానికి హత్తుకునేలా ఉంది.  పాటలో కుటుంబ బంధాలను సహజంగా చూపించిన తీరు ఆకట్టుకుంది.  ఆగస్టు 21న సినిమా థియేటర్స్‌‌‌‌కు రానుంది.