విమానంపై హనుమాన్ ఫోటో తొలగింపు

విమానంపై హనుమాన్ ఫోటో తొలగింపు

బెంగళూరులో జరిగే హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) 2023 ఏవియేషన్ లో ఒక విమానానికి అతికించిన హనుమాన్ స్టిక్కర్ ను తొలగించారు.  వివాదం తలెత్తడంతో అంతర్గతంగా చర్చించి ఆ స్టిక్కర్ ను  తొలగించామని హెచ్ఏఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంథకృష్ణన్ తెలిపారు.

ఏరో ఇండియా 2023 మొదటి రోజున హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL) తన సూపర్‌సోనిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ HLFT-42 ను  ప్రదర్శించింది. దాని రెక్కపై హనుమాన్ స్టిక్కర్ ను అతికించి.. తుఫాను వస్తోందంటూ మెసేజ్ కూడా పెట్టారు. దీనిపై కొందరు విమ్శలు చేశారు. ఆ తర్వాత అంతర్గతంగా చర్చించుకుని, దానిని ఉంచకూడదని నిర్ణయించుకున్నామని, అందుకే తొలగించామని చెప్పారు.  ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో అయిన ఏరో ఇండియా 2023ని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 98 దేశాల నుంచి 809 కంపెనీలు, ప్రతినిధులు పాల్గొంటారు.