Asia Cup 2025: సూపర్-4 బెర్త్ ఎవరిది.. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్

Asia Cup 2025: సూపర్-4 బెర్త్ ఎవరిది.. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్

ఆసియా కప్ లో ఆసక్తికర మ్యాచ్ మొదలైంది. గురువారం (సెప్టెంబర్ 18) గ్రూప్-బి లో చివరి మ్యాచ్ ఆడేందుకు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సిద్ధమయ్యాయి. అబుదాబి వేదికగా షేక్ జాయెద్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్ల మధ్య మధ్య జరగనున్న మ్యాచ్ తో గ్రూప్-లో సూపర్-4 కు చేరే జట్లేవో నేడే తెలిసిపోతుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంక స్పిన్నర్ తీక్షణ స్థానంలో వెళ్లలాగేను తీసుకొచ్చింది. 

ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్-4 కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా లంక జట్టుకు ఛాన్స్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భారీ తేడాతో అంటే 70 పరుగులతో ఓడిపోకుండా చూసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ ఏ టోర్నీలో రెండు మ్యాచ్ లో ఒకటి గెలిచింది. నేడు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధిస్తేనే సూపర్ -4 కు చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఇంటిదారి పడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కు ఇది డూ ఆర్ డై మ్యాచ్.

శ్రీలంక (ప్లేయింగ్ XI):

పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, నువాన్ తుషార

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): 

సెడిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, మహ్మద్ నబీ, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూ