మన అడవులకు ఆఫ్రికా చిరుతలు

మన అడవులకు ఆఫ్రికా చిరుతలు

మన దేశంలోని అడవులకు ఆఫ్రికా చిరుతలు రానున్నాయి. వాటిని నమీబియా నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. అయితే అవి ఇక్కడ జీవించేందుకు ముందుగా అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయాలని, అవి ఇక్కడి అడవుల్లో
జీవించగలవో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మాత్రమే వాటిని ఇండియాలో ప్రవేశపెట్టాలని చెప్పింది. ఇందుకు సుప్రీం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఒకవేళ ప్రయోగం సక్సెస్ అయితే ఆఫ్రికా చిరుతలను పెద్ద సంఖ్యలో ఇండియాకు తీసుకురావడంపై తాము నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
ఈ కమిటీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దేశంలో అంతరించి పోతున్న చిరుతలను బతికించేలా వాటిని తీసుకురావాలని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పదేళ్ల క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం 2013లో ఎన్టీసీఏ వినతిని తిరస్కరించింది. ఎలాంటి పరిశోధన లేకుండా విదేశీ జంతువులను మన దేశంలోకి తీసుకురావడం కరెక్టు కాదని పేర్కొంది. ఇప్పుడు తాజాగా సుప్రీం దీనికి అంగీకారం తెలిపింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ల బెంచ్ చీటాల ఎక్స్ పరిమెంటల్ ఇంట్రడక్షన్ కు ఓకే చెప్పింది. మిగిలింది 7,100 మాత్రమే…ప్రపంచవ్యాప్తంగా కేవలం 7,100 చిరుతలే మిగిలి ఉన్నాయని అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. వీటిలోనూ అన్నీ ఆఫ్రికా చిరుతలేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు మన దేశంలో కనిపించిన ఆసియా చిరుతలు ఇప్పుడు కేవలం ఇరాన్ లో మాత్రమే ఉన్నాయంటున్నారు. అవి కూడా 50  మాత్రమే మిగిలి ఉన్నాయట. ఇక మన దేశం విషయానికి వస్తే చివరిసారిగా 1967–68 మధ్యలో చీటా కనిపించింది. 19వ శతాబ్దంలో వందల సంఖ్యలో చీటాలు కనుమరుగయ్యాయని రీసెర్చ్
లను బట్టి తెలుస్తోంది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన ఇండియాలో దాదాపు 200 చిరుతలను చంపారని రీసెర్చ్​లు పేర్కొంటున్నాయి.

 కివీస్ కు చుక్కలు చూపించిన భారత్