
న్యూఢిల్లీ : దాదాపు ఐదేళ్ల తర్వాత ఇండియా మెన్స్ ఫుట్‌బాల్ టీమ్.. ఫిఫా ర్యాంకింగ్స్‌లో వందలోపు ర్యాంక్‌కు చేరింది. గురువారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఇండియా 99వ ర్యాంక్‌లో నిలిచింది. ప్రస్తుతం ఇండియా ఖాతాలో 1208.69 పాయింట్లు ఉన్నాయి. గత నెలలో జరిగిన శాఫ్ చాంపియన్‌షిప్‌లో బలమైన లెబనాన్, కువైట్ జట్లపై గెలవడం ర్యాంక్ మెరుగుపడ టానికి దోహదం చేసింది.
1996లో 94వ ర్యాంక్‌ను సాధించిన ఇండియా 1993లో 99వ ర్యాంక్‌తో, 2017-18లో 96వ ర్యాంక్ లో నిలిచింది. లెబనాన్ వందో ర్యాంక్‌లో ఉండగా, కువైట్ 137వ ర్యాంక్‌ను సాధించిం ది. అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లండ్, బెల్జియం టాప్-5లో కొనసాగుతున్నాయి.