రిలేషన్ : పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇలా ఉంటే.. చంపుకోవటం.. చావటం ఆలోచనలు ఉండవు..

రిలేషన్ : పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఇలా ఉంటే.. చంపుకోవటం.. చావటం ఆలోచనలు ఉండవు..

సమాజంలో అందరికి ఎప్పుడు పెళ్లి అవుతుంది.లవ్ మ్యారేజ్ అయితే ముందే ఒకరికొకరు పరిచయముంటారు. అదే అరేంజ్డ్ మ్యారేజ్ అయితే.. ఇరువురు వ్యక్తులు అస్సలు సంబంధం లేనివారు ఒక్కటవుతారు. అలాంటప్పుడు ఒకరి నొకరు నొప్పించకుండా ఉండాలి. అది ఒకరోజు.. ఒక సంవత్సరం కాదు. వారు బతికున్నంత కాలం అలానే ఉండాలి. పెళ్లి మొదట్లో ఉన్న ప్రేమ.. ఆప్యాయత.. అనురాగం .. జీవితం చివరిదాకా ఉండాలంటే ఏంచేయాలి... ఎలాంటి పద్దతులు అవలంభించాలో తెలుసుకుందాం... 

ప్రతీ ఒక్కరికీ ఇండివిద్యువల్ లైఫ్ ఉంటుంది. సింగిల్ గా ఉన్నంత వరకూ ఎవరి ప్రపంచంలో వాళ్లు హాయిగా విహరిస్తుంటారు. అంతవరకూ ఓకే. మరి పెళ్లయినప్పుడో.! పెళ్లి తర్వాత ఇండివిద్యువల్ లైఫ్ కాస్త మ్యారిటల్ లైఫ్ లా మారిపోతుంది. ఆ లైఫ్ ని కూడా హ్యాపీగా మార్చుకోవాలంటే.. అక్కడే కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవసరం. బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయినా ఆ ఎఫెక్ట్ లైఫ్ లా ఉండిపోతుంది.

ప్రేమలో ఉన్నప్పుడు ఇలా ఉండాలి.. అలా ఉండాలి' అని ఎవరూ చెప్పారు. ఒకవేళ చెప్పినా అది అబద్దం ఎందుకంటే. ఎలాంటి రూల్స్ లేకపోవడమే నిజమైన ప్రేమ. ప్రేమలో రూల్స్ ఉండవు సరే.. మరి పెళ్లిలో.. పెళ్లి తర్వాత కూడా ప్రేమేగా అక్కడ కూడా ఎలాంటి రూల్స్ ఉండకపోతే పొరపాటే. పెళ్లంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు. అదొక కమిట్ మెంట్ ... ఒక బాధ్యత కాబట్టి కొన్ని విషయాలు సరిచూసుకుంటేనే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా మారుతుంది.

త్యాగాలు వద్దు

పరిచయం అయిన కొత్తలో ఒకరిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అప్పియరెన్స్ ఒక్కటే కాదు మాట్లాడే మాటలు కూడా ఎదుటివాళ్లకి నచ్చాలని నానా ప్రయత్నాలు చేస్తారు. అలాంటప్పుడే. కొన్ని విషయాల్లో త్యాగం చేయడానికి' సిద్ధపడతారు. అది ఎదుటివారికి అర్థమవ్వాలని కూడా కోరుకుంటారు. ఆ త్యాగానికి 'ప్రేమ' అనే ట్యాగ్ తగిలించి తమలో తామే మురిసిపోతుంటారు. అలా తెలియకుండా టైం అంతా పార్ట్నర్ తోనే సరిపోతుంది. దాంతో ఫ్రెండ్స్ ని, మన ఇష్టాలని పూర్తిగా వదిలేస్తాం. 

రోజులు గడిచే కొద్దీ ఇంకా పూర్తిగా మారిపోతాం. మరీ ఎక్కువగా త్యాగం చేయడం వల్ల మనల్ని మనం మర్చిపోతాం. కొన్నాళ్లకు మనం ఎంతగానో ఇష్టపడే పార్ట్‌నర్ మనతోనే ఉన్నా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే.. మరీ ఎక్కువ త్యాగాలు కూడా పనికి రావు. మీ పరిచయానికి ముందు నుండి మీ అభిరుచుల్ని పెళ్లి తర్వాత మార్చుకోవాల్సిన పనిలేదు. అందుకే పెళ్లికి ముందే మీ ప్యాషన్ గురించి మీ పార్ట్ నర్ తో పంచుకోవాలి. ఇద్దరూ ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడు మీ లైఫ్ మీకు నచ్చినట్టుగా ఉంటుంది. 

కొత్తదనాన్ని కొత్తగా...

రిలేషన్ షిప్ స్టాటింగ్ లో ఎక్సైట్ మెంట్.. ఆనందంలాంటి పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ బయటకొస్తుంటాయి. కొత్తలో అన్నీ కొత్తగా అనిపిస్తాయి. కానీ ఆ కొత్తదనం రాను రాను పాతదైపోతుంది. ఆ కొత్తదనాన్ని లైఫింగ్ కంటిన్యూ చేయడం రిలేషన్ షిప్ లో ఒక ఆర్ట్. హ్యాపీగా ఉంటే కపుల్స్ ని గుర్తించే వాటి ప్రతీ రోజు ఏదో ఒక యాక్టివిటీ రూపంలో ఒకరినొకరు నవ్వించడం ..ఆటపట్టించడం లాంటివి చేస్తుంటారని ఓసర్వేలో వెల్లడైంది. 

పెళ్లికి ముందు ఒకరి గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ఎక్సైట్ మెంట్ ఉంటుంది. కొన్నేళ్లు గడిచాక.. కొత్తగా తెలుసుకునేందుకు ఉండదు. అప్పుడు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సంతోషపడాల్సి వస్తుంది. దానికి బదులు పార్ట్‌నర్‌లో కొత్తదనాన్ని వెతికే ప్రయత్నం చేస్తే.. తమలో రోజులో కొత్త కోణం కనిపించొచ్చు. సైకాలజీ ప్రకారం మనిషి ఆలోచనలు బిహేవియర్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. మెదడు పరిధులు దాటే కొద్దీ కొత్తకొత్త ఆలోచనలు చిగురిస్తాయి. జీవితాంతం కొత్తగా ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చన్న మాట..

స్ట్రెంట్స్ ఏంటో తెలుసా

మీ పార్ట్ నర్ ఎలాంటి విషయాల్లో బెస్ట్ అనేది ఏదో తెలుసుకోవాలి. ప్రత్యేకించి తెలుసుకోకపోయినా కాస్త గమనిస్తే అర్థమవుతుంది. తాను క్రియేటివ్ పర్సనా? ఎక్కువ క్యూరియాసిటీ ఉందా?. లీడర్ షిప్ క్వాలిటీస్ మెరుగ్గా ఉన్నాయా.? ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారా? ఇలాంటి విషయాలు కాస్త గమనిస్తే అర్థమవుతుంది. మీ పార్ట్నర్ స్ట్రెంత్ ఏంటో మీకు తెలిస్తే మీరు హ్యాపీగా ఉండడానికి కీ దొరికినట్టే. వాళ్లకున్న క్వాలిటీస్ ని బట్టి -ఎమోషన్స్ అన్నీ దానికి తగ్గట్టుగా ఉంటే చాలు. తాను క్రియేటివ్ పర్సన్ అని మీకనిపిస్తే తన క్రియేటివిటీని మెచ్చుకోండి. దానికి మరింత పదును పెట్టే ప్రయత్నం చేయండి. అలా చేస్తే తనకంటే సంతోషపడేవాళ్లు మరొకరు ఉండరు. ఇదే పని తిరిగి మీ పార్ట్నర్ కూడా చేస్తే మీ అంత సంతోషపడే వారు కూడా మరొకరు ఉండరు.

చిన్న మాటలే అయినా..

మీ పార్టనర్ మీకోసం ఏదైనా చేసినా, తమ ద్వారా మీకేమైనా మంచి జరిగినా ఓ చిన్న థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, మీవల్ల మీ పార్టనర్ హర్ట్ అయినా సారీ చెప్పండి. థాంక్స్.. సారీ ఇవి వినడానికి చాలా చిన్న పదాలు కానీ రిలేషన్ షిప్‌లో వీటిదే కీ రోల్. ఇవి ఎంత తమాషాగా ఉంటాయంటే.. థాంక్స్ చెప్పినా, సారీ చెప్పినా... చెప్పినపుడు మనమధ్య ఇలాంటి పట్టింపులెంచుకు? అవి అన్న తనకోసం ఇంత చేసినపుడు థ్యాంక్స్ కూడా చెప్పరా' అని ఎదురు చూడడం సహజం. ఇదంతా ప్రేమలో భాగమే.. ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ ఎంతో మధుర క్షణాలుగా మిగిలిపోతాయి. దాంతోపాటు ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్‌లు, గ్రీటింగ్ లు... సర్ ఫ్రైజ్‌లు క్రియేటివ్‌గా ప్రేమను తెలిపేలా ఉండాలి.. ఇరవైలోపు ఉన్న ఆలోచనల్ని అరవైళ్లలో కూడా కొనసాగించాలి. రొటీన్ లైఫ్ బోర్ గా అనిపిస్తే అప్పుడప్పుడు ఏదైనా లాంగ్ టూర్ కు వెళ్లొస్తుండాలి. 

రొమాంటిక్ గా కూడా..

కపుల్స్ మధ్య కొన్ని రొమాంటిక్ హ్యాబిట్స్ ఉంటాయి. రోజూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం, ప్రతిరోజూ నిద్రకు ముందు కాసేపు మాట్లాడుకోవడం... వారానికొకరోజు సెకండ్ షో సినిమాకెళ్లడం లాంటివి. ఇలా కలిసి గడిపే సందర్భాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవేయకూడదు. ఇలాంటి రొమాంటిక్ హ్యాబిట్స్ ను మీకు తెలియకుండానే అలవరుచు ఉంటారు. ఈ అలవాట్లే ఇద్దరినీ మానసికంగా దగ్గరగా ఉంచుతాయి. ఇద్దరి మధ్య ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు ఈ అలవాట్లే తిరిగి దగ్గరకు వస్తాయి.

ఎమోషనల్ డిపిండెన్స్

లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కొంతకాలానికి అప్పుడు అలా అన్నావు... అలా చేశావు.. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు.. అనే మాటలు కొన్ని వస్తాయి. సందర్భాలో... ఇలా ఎందుకు జరుగుతుందంటే.. పెళ్లికి ముందు ఇద్దరి మధ్య ఖాళీ ఉండదు. ఎమోషనల్ గా ఒకరికొకరు బాగా దగ్గరవుతారు. ఇండివిద్యువాలిటీ పూర్తిగా నశించి తనే ప్రపంచం అనేలా మారిపోతారు. దాన్నే 'ఎమోషనల్ డిపెండెన్స్' అంటారు. దీనివల్ల ఎదుటివారిలో కొంచెం మార్పు వచ్చినా తట్టుకోలేరు. అందుకే ఇద్దరి మధ్య తగినంత ఉండాలి. ఇద్దరూ వాళ్లకంటూ వ్యక్తిగత ప్రపంచాలు ఏర్పరుచుకుని వాటి అనుభవాలను పంచుకోవాలి.

మూడో వ్యక్తి జోక్యం

పెళ్లయిన కొత్తలో ఎంతమందిలో ఉన్న వాళ్ల పర్సనల్ స్నేస్ లో వాళ్లుంటారు. కానీ ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు మాత్రం పర్సనల్ స్పేస్ కాస్త ఇండివిడ్యువల్ స్నేస్ లా మారుతుంది. ఇద్దరి మధ్య చాలా పెద్ద గ్యాప్ వస్తుంది.ఇలాంటప్పుడే గొడవ సద్దుమణిగడానికి మూడే వ్యక్తి జోక్యం అవసరమవుతుంది. మూడో వ్యక్తి దాకా వచ్చిందంటే ఆ గ్యాప్ అలాగే ఉంటుంది. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అయినా దాని తాలూకు ఇంపాక్ట్ మాత్రం చెరిగిపోడు. అందుకే ఏదొచ్చినా మూడో వ్యక్తిదాకా వెళ్లకూడదు. జరిగిన తప్పును శాంతంగా పరిష్కరించుకోవాలి..ప్రేమలో ఎదుటివారి తప్పును వేలెత్తి చూపించడం కన్నా ఆ పొరపాటు ఎందుకు జరిగిందో తెలుసుకునే సాహసం ఉండాలి.