ఆయుర్వేద ప్రొడక్ట్​ల స్పీడ్‌‌ తగ్గింది!

ఆయుర్వేద ప్రొడక్ట్​ల స్పీడ్‌‌ తగ్గింది!

 

  • గత రెండేళ్లలో పెద్దగా పెరగని డిమాండ్‌‌

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: పెద్ద పెద్ద కంపెనీలూ ఆయుర్వేద ప్రొడక్ట్‌‌లను తీసుకొస్తున్నప్పటికీ, గత రెండేళ్లలో వీటి డిమాండ్ పెద్దగా పెరగలేదని ఓ సర్వే వెల్లడించింది.  కరోనా వలన గత రెండేళ్లలో ఆయుర్వేద ప్రొడక్ట్‌‌లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని  అంచనా వేశారు. కానీ, సేల్స్ మాత్రం పెద్దగా పెరగలేదని, కొన్ని సెగ్మెంట్‌‌లలో ఆయుర్వేద ప్రొడక్ట్‌‌లకు డిమాండ్‌‌ కూడా తగ్గిందని రీసెర్చ్ కంపెనీ నీల్సన్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఓరల్‌‌ కేర్ సెగ్మెంట్‌‌లోని  హెర్బల్‌‌ (మూలికలు) ప్రొడక్ట్‌‌ల వాటా గత రెండేళ్ల నుంచి 28 శాతంగానే కొనసాగుతోందని వివరించింది. హెయిర్ ఆయిల్‌‌ సెగ్మెంట్‌‌లో హెర్బల్స్‌‌  ప్రొడక్ట్‌‌ల వాటా 7.8 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గింది. ఆయుర్వేదిక్ షాంపూల వాటా మాత్రం  8.1 శాతం నుంచి 8.8 శాతానికి పెరిగింది. పెద్ద కంపెనీలు కొత్త ప్రొడక్ట్‌‌లను లాంచ్ చేయడంతో   కన్జూమర్లు వీటి వైపు షిఫ్ట్ అవ్వడం పెరిగిందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.  కరోనా సంక్షోభం వలన చిన్న కంపెనీలు డిస్ట్రిబ్యూషన్ సమస్యలు ఎదుర్కొన్నాయని, దీంతో పెద్ద కంపెనీల బ్రాండ్ల వైపు కన్జూమర్లు షిఫ్ట్ అవ్వడం పెరిగిందని అన్నారు. 

విటమిన్‌‌లు, సప్లిమెంట్‌‌లు బాగా కొన్నారు..
2020 లో విటమిన్‌‌లు, సప్లిమెంట్‌‌లు, ఇమ్యూనిటీ బూస్టర్లను 41 శాతం మంది ప్రజలు  తీసుకున్నారని యూరోమిటర్‌‌‌‌ సర్వే గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.  2021లో  50 శాతం మంది వీటిని తీసుకున్నారని తెలిపింది. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌‌లపై కన్జూమర్లకు ఇంట్రెస్ట్ పెరగడంతో చాలా కంపెనీలు  ఆయుర్వేదిక్ ఫార్ములేషన్స్‌‌తో ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చాయి. సాధారణంగా పర్సనల్ కేర్ సెగ్మెంట్‌‌లో ఎంట్రీ ఇచ్చే కంపెనీలు ఈ టైమ్‌‌లో ప్యాకేజ్డ్ ఫుడ్ సెగ్మెంట్‌‌లో ఎంట్రీ ఇవ్వడాన్ని చూడొచ్చు.  గత రెండేళ్లలో ఆన్‌‌లైన్ షాపింగ్ కూడా బాగా పెరగడంతో కన్జూమర్లు బాగా పాపులరయిన బ్రాండ్లే కాకుండా  చిన్న బ్రాండ్ల వైపు చూడడం పెరిగింది.  కస్టమర్లకు టేస్ట్‌‌కు అనుగుణంగా ప్రొడక్ట్‌‌లను తీసుకొస్తుండడంతో మార్కెట్‌‌లో మాకు కొంత ఎడ్జ్‌‌ దొరికిందని వేదిక్స్‌‌ బిజినెస్ హెడ్‌‌  జైతిన్ గుజ్రాతి అన్నారు. ఎటువంటి కెమికల్స్ లేని ప్రొడక్ట్‌‌ల వైపు కస్టమర్లు మరలుతున్నారని, కస్టమైజ్డ్‌‌, డీ2సీ (డైరెక్ట్‌‌ టూ కన్జూమర్స్‌‌ ) బ్రాండ్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయని అన్నారు. పతంజలి,  డాబర్ వంటి కంపెనీల వలన ఆయుర్వేదిక్  ట్రెండ్ స్టార్టయినప్పటికీ, ప్రస్తుతం డీ2సీ వలన చిన్న కంపెనీలు కూడా ఈ కేటగిరీలో విస్తరిస్తున్నాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ తాజాగా ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. 

సేల్స్ పెరుగుతాయి..
ఎఫ్ఎంసీజీ  కంపెనీలు మాత్రం గత రెండేళ్లలో ఆయుర్వేద ప్రొడక్ట్‌‌ల సేల్స్ బాగానే ఉన్నాయని  చెబుతున్నాయి. హెర్బల్‌‌, నేచురల్‌‌ ప్రొడక్ట్‌‌లపై కన్జూమర్ల ఆసక్తి బాగా పెరిగిందని, పర్సనల్ కేర్ సెగ్మెంట్‌‌లో ఇది ఎక్కువగా ఉందని డాబర్ ఇండియా సీఈఓ మోహిత్ మల్హోత్రా అన్నారు. ‘ఓరల్ కేర్ సెగ్మెంట్‌‌లో కన్జూమర్ల ఆసక్తి పెరగడాన్ని చూడొచ్చు. సాధారణ టూత్‌‌పేస్ట్‌‌ల కంటే నేచురల్‌‌, ఆయుర్వేదిక్ టూత్‌‌పేస్ట్‌‌లకు డిమాండ్ పెరగడాన్ని గమనించొచ్చు’ అని పేర్కొన్నారు.  ఓరల్‌‌ కేర్‌‌‌‌, హెయిర్ ఆయిల్ సెగ్మెంట్‌‌లో తమ వాటా పెంచుకున్నామని  అన్నారు.  సిబాకా వేద్‌‌శక్తి, కోల్గేట్‌‌ స్వర్ణ వేద్‌‌శక్తి, లెవర్‌‌‌‌ ఆయూష్‌‌, హిమాలయ వంటి ఆయుర్వేదిక్ టూత్‌‌పేస్ట్ బ్రాండ్ల గ్రోత్‌‌ 2020–21 లో తగ్గినట్టు  నీల్సన్  డేటా ద్వారా తెలుస్తోంది. షాంపూల  కేటగిరీలో పతంజలి గ్రోత్ బాగా తగ్గింది.  కరోనాకు ముందు పతంజలితో  పోటీగా అనేక ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చాయి. కరోనాకు ముందు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్‌‌లకు మంచి డిమాండ్ క్రియేట్ అవ్వడంతో కరోనా టైమ్‌‌లో వీటి గ్రోత్‌‌ పెద్దగా పెరగలేదని నీల్సన్ పేర్కొంది.