జెన్ జీ బ్యాంకుల కంటే డిజిటల్, ఫాస్ట్ పే ఎక్స్పీరియెన్స్కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. తమ బ్యాంకింగ్ అలవాట్లలోనూ కొత్తదనం తీసుకొస్తున్నారు. వాటిలో మొదటిది మల్టిపుల్ బ్యాంకింగ్ రిలేషన్ షిప్స్.. జెన్ జీలో సుమారు 60% మంది తమ ఆర్థిక కార్యకలాపాలను ఒకే బ్యాంకుకు పరిమితం చేయకుండా పలు ప్రొవైడర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
సగటున ప్రతి ఒక్కరూ రెండు బ్యాంకులు, రెండు డిజిటల్ వాలెట్లను ఉపయోగిస్తున్నారు. రెండోది ప్రైమరీ బ్యాంక్ మార్పు.. జెన్ జీలో 20% మంది రాబోయే ఆరు నెలల్లో తమ ప్రధాన బ్యాంకును మార్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇకపోతే.. గత ఏడాదిలో మూడింట ఒక వంతు జెన్ జీ, మిలీనియల్ కస్టమర్లు మెరుగైన సేవల కోసం తమ ప్రైమరీ బ్యాంకును మార్చేశారు. ముఖ్యంగా యూత్ లోన్ల కోసం ట్రెడిషనల్ పద్ధతుల కంటే నిమిషాల్లో అప్రూవల్ ఇచ్చే యాప్‌లనే ఎక్కువగా నమ్ముతున్నారు.
అంతేకాదు.. సుమారు 42% మంది జెన్ జీ కస్టమర్లు ప్రస్తుత బ్యాంకుల డిజిటల్ ఇంటర్‌ఫేస్ సంతృప్తికరంగా లేదని భావిస్తున్నారు. మెరుగైన డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం 82% మంది తమ ప్రస్తుత బ్యాంకును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జెన్ జీ కేవలం తక్కువ చార్జీలు లేదా ఎక్కువ వడ్డీ కోసం మాత్రమే కాకుండా, తమ పర్సనల్ వ్యాల్యూస్, సామాజిక బాధ్యతతో సరితూగే బ్యాంకులను ఎంచుకుంటున్నారు. వీళ్లు కేవలం డబ్బును దాచుకోవడమే కాకుండా ఖర్చులను ట్రాక్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి యాప్ లోనే టూల్స్ వెతుకుతున్నారు.
ఇదిలా ఉంటే, 45% మంది జెన్ జీ కస్టమర్లు ఫిజికల్ బ్రాంచ్‌లు లేని బ్యాంకుల్లో అకౌంట్ తెరవడానికి ఇష్టపడటం లేదు. ముఖ్యమైన సలహాల కోసం వారు నేరుగా కలవాలని కోరుకుంటున్నారు. బ్యాంకులు తమ ట్రెడిషనల్ పద్ధతులను మార్చుకోకపోతే, ఈ కొత్త తరం కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. కేవలం ఒక బ్యాంకులో ఖాతా ఉండటం కంటే, బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే ప్లాట్‌ఫామ్‌లకే జెన్ జీ ఓటు వేస్తున్నారు.

