ఒమేగా హాస్పిటల్స్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 2026 అక్టోబర్ 30వ తేదీన ఒకేసారి మొత్తం 24 ప్రాంతాల్లో ఐటీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు జరుపుతున్నారు.
హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఒమేగా హాస్పిటల్స్ శాఖలు, కీలక వైద్యుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. భారీగా డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆర్థిక లావాదేవీల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, భారీ నగదు లావాదేవీల ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారుల ఆరా తీస్తున్నారు.
