V6 News

భారత్ లో బీఎండబ్ల్యూ కొత్త బైక్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

భారత్ లో బీఎండబ్ల్యూ కొత్త బైక్..ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

బీఎండబ్ల్యూ మోటారాడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఎండబ్ల్యూ ఎఫ్ 450 జీఎస్ (BMW F 450 GS) అడ్వెంచర్ బైక్‌ను ఏప్రిల్ 23, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. G 310 GS మోడల్‌కు బదులుగా ఈ సరికొత్త మిడ్-కెపాసిటీ బైక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది. ఈ బైక్‌కు సంబంధించిన ధర, ఫీచర్లు,ఇతర వివరాలు తెలుసుకుందాం.

ధరలు ,వేరియంట్లు..

ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది 

  • బేస్ బైక్ ధర : రూ. 4.70 లక్షలు
  • ఎక్స్‌క్లూజివ్ బైక్ : రూ. 4.90 లక్షలు
  • జీఎస్ ట్రోఫీ ధర : రూ. 5.30 లక్షలు

ఇంజిన్ ,పనితీరు ..

ఈ బైక్‌లో సరికొత్త 420cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 8750 rpm వద్ద 48 hp శక్తిని, 6750 rpm వద్ద 43 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్ ,బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఉన్నాయి. 

కీలక ఫీచర్లు ..

బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 6.5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. రోడ్, రెయిన్ ,ఎండ్యూరో రైడింగ్ మోడ్ లు ఉన్నాయి.  జీఎస్ ట్రోఫీ వేరియంట్‌లో ప్రత్యేకంగా  ఎండ్యూరో ప్రో (Enduro Pro) మోడ్ కూడా ఉంటుంది. సేఫ్టీకి సంబంధించి ఏబీఎస్ ప్రో (ABS Pro), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ ,ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఈజీ రైడ్ క్లచ్ (ERC): ఇది తక్కువ వేగంలో లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు క్లచ్ లివర్‌ను పదేపదే ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.
సస్పెన్షన్ & బ్రేక్స్: ముందు భాగంలో 43 mm KYB అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం బ్రెంబో కాలిపర్స్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు అందించారు.

డెలివరీ ,తయారీ..

తయారీ: ఈ బైక్‌ను టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తో కలిసి తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. 
బుకింగ్స్ , డెలివరీలు: బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2026 జూన్ నెల నుండి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

భారత మార్కెట్లో ఈ బైక్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 , కేటీఎం 390 అడ్వెంచర్ ,హోండా ఎన్ఎక్స్500 వంటి అడ్వెంచర్ బైక్‌లకు గట్టి పోటీని ఇవ్వనుంది.