పుట్ట మధుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 300 మంది భేటీ!

పుట్ట మధుకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో 300 మంది భేటీ!

హైదరాబాద్, వెలుగు : పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్  పార్టీ నేతలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. హైదరాబాద్  నగర శివార్లలో బీఆర్ఎస్  పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మండలాలకు సంబంధించిన 300 మంది నాయకులు సమావేశం అయినట్లు సమాచారం.

మంథనిలో అరాచకాలు, రౌడీయిజం రూపుమాపే విధంగా ప్రజల్లో గుణాత్మక మార్పు తేవాలని, పుట్ట మధు అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచించుకోవాలని చర్చించినట్లు తెలిసింది. లేకపోతే ప్రజా ఉద్యమాలు చేసి పుట్ట మధు లాంటి వారికి టికెట్ రాకుండా చేయాలని చర్చించినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ రహస్య సమావేశం జరిగింది.