V6 News

ఎంఎస్‌‌ రాజు దర్శకత్వంలో అగధ

ఎంఎస్‌‌ రాజు దర్శకత్వంలో అగధ

నిర్మాతగా, దర్శకుడిగా పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన ఎంఎస్‌‌ రాజు.. డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘అగధ’ అనే పాన్‌‌ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రానికి నిర్మాత. తాజాగా ఈ మూవీ పోస్టర్‌‌‌‌ను రివీల్ చేశారు. ఓ చీకటి గుహలో వెలుగుతున్న కాగడాల మధ్య పన్నెండు చేతులతో ఓ భారీ విగ్రహం. 

ఆ విగ్రహం ఎదురుగా విభిన్నమైన వేషధారణతో ఓ అమ్మాయి వెనుక నుంచి కనిపిస్తోంది. మిస్టిక్‌‌ ఎలిమెంట్స్‌‌తో డిజైన్ చేసిన ఈ పోస్టర్‌‌‌‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్‌‌ రాజు మాట్లాడుతూ ‘ఇదొక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్. రకరకాల సెట్లు, విభిన్న లొకేషన్లలో 85 రోజులు షూటింగ్ చేశాం. 

ఇందులో 45 నిమిషాల వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. నటీనటులు ఎవరనేది త్వరలో రివీల్ చేస్తాం’ అని చెప్పారు.