V6 News

ఏఐతో ఆ ముప్పు లేదు..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో జర్నలిస్టులకు వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌

ఏఐతో ఆ ముప్పు లేదు..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో జర్నలిస్టులకు వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఏఐ మానవ వనరుల వినియోగాన్ని పూర్తిగా తొలగిస్తుందన్నది వాస్తవం కాదని సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్టు, ఏఐ నిపుణుడు ఉడుముల సుధాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్, ఏఐ ఫర్‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌ రెడీనెస్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ , డేటా లీడ్స్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఆయన జర్నలిస్టుల కోసం సోమవారం వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

డేటా సెట్స్, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లలో ఉన్న సమాచారమే ఏఐ ద్వారా అందుతుందన్నారు. ఏఐతో ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ థింకర్స్, రైటర్స్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి ఇబ్బంది రాదన్నారు. ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు ఎస్‌‌‌‌‌‌‌‌.విజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి జర్నలిస్టూ ఎప్పటికప్పుడు అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ కావాల్సిన అవసరం ఉందని,  ఇందులో ఏఐ వినియోగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.