ఇవాళ్టి( ఆగస్టు 17) నుంచి బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్ చాంపియన్‌‌ షిప్స్

ఇవాళ్టి( ఆగస్టు 17) నుంచి బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్ చాంపియన్‌‌ షిప్స్
  •     ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎరేనాలో వారం పాటు సమరం
  •     17 ఏండ్ల విరామం తర్వాత ఆతిథ్యమిస్తున్న ఇండియా
  •     టైటిల్ ఆశలు మోస్తున్న పీవీ సింధు, లక్ష్యసేన్

న్యూఢిల్లీ: బీడబ్ల్యూఎఫ్ ( బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​)వరల్డ్ చాంపియన్ షిప్స్–30వ ఎడిషన్‌‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా సిద్ధమైంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎరేనాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమరం వారం రోజుల పాటు సాగనుంది. సుమారు 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ మెగా టోర్నీ మళ్లీ భారత గడ్డపై జరుగుతుండడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  టోర్నమెంట్‌‌లో మెన్స్, విమెన్స్ సింగిల్స్, డబుల్స్‌‌తో పాటు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి షట్లర్లు టైటిల్ కోసం తలపడనున్నారు. మొదటి రెండు రోజులు తొలి రౌండ్ మ్యాచ్‌‌లు జరగనుండగా, ఆ తర్వాత క్వార్టర్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించనున్నారు. సొంతగడ్డపై జరుగనున్న ఈ టోర్నీలో ఇండియా తరఫున స్టార్ ఆటగాళ్లు పతాకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. విమెన్స్ సింగిల్స్‌‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా, మెన్స్ సింగిల్స్‌‌లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో స్టార్ జోడీ సాత్విక్‌‌ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడిపై భారీ అంచనాలు ఉన్నాయి. వారితో పాటు త్రీసా జాలీ–-గాయత్రి గోపీచంద్, ధ్రువ్ కపిల–-తనీషా క్రాస్టో జోడీలు కూడా పోటీలో ఉన్నాయి. సొంత అభిమానుల మద్దతు మధ్య భారత షట్లర్లు పతకాల వేటలో ఎంతవరకు రాణిస్తారో చూడాలి. 

బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్ చాంపియన్ షిప్స్ షెడ్యూల్

  • ఆగస్టు 17 సోమవారం ఫస్ట్ రౌండ్ 
  • (రౌండ్ ఆఫ్ 64 / 48 - అన్ని విభాగాల్లో)
  • ఆగస్టు 18 మంగళవారం ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ మ్యాచ్‌‌లు 
  • ఆగస్టు 19 బుధవారం రెండో రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)
  • ఆగస్టు 20 గురువారం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16)
  • ఆగస్టు 21శుక్రవారంక్వార్టర్ ఫైనల్స్
  • ఆగస్టు 22 శనివారం సెమీ ఫైనల్స్
  • ఆగస్టు 23 ఆదివారం ఫైనల్స్
  • ఈ మ్యాచ్‌‌లన్ని ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌‌వర్క్‌‌లో ప్రత్యక్ష ప్రసారాలు, జియో హాట్‌‌స్టార్‌‌‌‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

  •