రాహుల్ జోడో యాత్రకు 10 కమిటీలు వేసిన కాంగ్రెస్

రాహుల్ జోడో యాత్రకు 10 కమిటీలు వేసిన కాంగ్రెస్

తెలంగాణలో రాహుల్ జోడో యాత్రకు  రాష్ట్ర కాంగ్రెస్ 10 రకాల కమిటీలు వేసింది. కేసీ వేణుగోపాల్ హెచ్చరికలతో కదిలిన  టీపీసీసీ..వెంటనే 10 రకాల కమిటీలను వేసింది. అలంకరణ కమిటీ , ట్రాఫిక్ క్లియరెన్స్ &పార్కింగ్ కమిటీ , మౌళిక వసతుల కమిటీ , ఫుడ్&వాటర్ మేనెజ్మెంట్ కమిటీ, మీడియా మేనెజ్మెంట్ కమిటీ, గార్బేజ్ కమిటీ, పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ, రూట్ కో ఆర్డినేషన్ కమిటీ, కల్చరల్ ఆక్టీవిటీ కమిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలను నియమించింది. 

కేసీ వేణుగోపాల్ అసహనం
భారత్ జోడో యాత్రపై గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ ముఖ్యనేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ జోడో యాత్ర కోసం తెలంగాణలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌పై చర్చించారు. భారత్ జోడోకు విస్తృతమైన ప్రచారం చేయాలని వేణుగోపాల్ పీసీసీని ఆదేశించారు. ప్రతీ గ్రామంలో హోర్డింగులు ,స్కూళ్లలో  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కేసీ వేణుగోపాల్ వార్నింగ్తో ప్రతీ గ్రామంలో జోడో యాత్ర గురించి చర్చ జరిగేలా టీపీసీసీ యాక్షన్ ప్లాన్ రేడీ చేసింది.

23న తెలంగాణలోకి యాత్ర
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ నెల 23న తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. 23న హాఫ్ డే మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తారు. 24, 25న పాదయాత్రకు బ్రేక్ ఉంటుంది. 26 నుంచి రాహుల్ యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. తెలంగాణలో రాహుల్ యాత్రకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైంది. మొత్తం 12 రోజుల పాటు 375 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నారు. కర్ణాటకలోని రాయచూర్ నుంచి ముక్తల్‌లోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.