
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సోమవారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్రలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నెక్లెస్ రోడ్డులో జరిగే కార్నర్ మీటింగ్‌లోనూ ఖర్గే పాల్గొంటారని తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండడంతో, ఖర్గేకు ఘన స్వాగతం పలికేందుకు పీసీసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.