రాహుల్ వయనాడ్ లో ఓడిపోవడం ఖాయం

రాహుల్ వయనాడ్ లో ఓడిపోవడం ఖాయం

హైదరాబాద్: దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సవాలు విసిరారు. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు రాహుల్ నిన్న జరిగిన వరంగల్ సభలో అన్నారు. అందుకు సమాధానమిస్తూ అసదుద్దీన్ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. ఎలాగూ కేరళలోని వయనాడ్ లో రాహుల్ ఓడిపోవడం ఖాయమని... హైదరాబాద్ లేదంటే మెదక్ లో పోటీ చేసి రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని  అసదుద్దీన్ ఓవైసీ సూచించారు.