ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఈఓ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ రాజీనామా

ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఈఓ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ రాజీనామా

వారసుడి కోసం టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెతుకులాట

న్యూఢిల్లీ:  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా సీఈఓ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విల్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది జులై వరకు ఉన్నప్పటికీ,  రాజీనామాను  బోర్డు ఆమోదించింది. కొత్త సీఈఓ  నియామకం వరకు ఆయన కొనసాగనున్నారు. కొత్త సీఈఓ కోసం  టాటా గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత కొన్ని నెలలుగా వెతుకుతోంది. 2025 జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ప్రమాదం, తరచూ సేఫ్టీ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘిస్తుండడం,  భారీ నష్టాలు, ఆపరేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సవాళ్లు వంటివి  ఆయన రాజీనామాకు కారణమయ్యాయి.   

సింగపూర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓగా పనిచేసిన తర్వాత 2022లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలో చేరిన విల్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  విహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాట్‌‌‌‌‌‌‌‌ ఏఐ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాను ప్రపంచ స్థాయి క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చాలని చూశారు.    రిపోర్ట్స్ ప్రకారం, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాకు  2025–26లో  రూ.20 వేల కోట్ల నష్టం వచ్చిందని అంచనా. తాజాగా   ఇండిగోలో పీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్బర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విల్లీ వాల్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓగా నియమితులయ్యారు.