న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మరో రెండు నెలల పాటు ఇజ్రాయెల్‌కు తన కార్యాకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2026, జూలై చివరి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. దీంతో జూలై చివరి వరకు ఎయిర్ ఇండియా విమానాలు ఇజ్రాయెల్‌కు రాకపోకలు సాగించవు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో తొలుత 2026, జూన్ చివరి వరకు ఇజ్రాయెల్‌కు తమ సర్వీసులను నిలిపివేసింది ఎయిర్ ఇండియా. కానీ మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగక పోవడంతో ఈ ఆంక్షలను 2026, జూలై నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు గురువారం (మే 28) ఎయిర్ ఇండియా ప్రకటించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితి కారణంగా విమానాలను జూలై 31 వరకు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని కోరింది.
