ఎయిర్ ఇండియాకు పెను ప్రమాదం తప్పింది. అమెరికా నెవార్క్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను స్వీడెన్ స్టాక్ హోంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సాంకేతిక లోపంతో ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కావడాన్ని పైలెట్స్ గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్ ను స్టాక్ హోంకు దారి మళ్లించారు. ఘటన సమయంలో ఫ్లైట్ లో ఉన్న 300 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
