బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువని అన్నారు రేవంత్. ఫ్యూచర్ సిటీలో ఎఫ్ సీడీఏ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్.. హైదరాబాద్ నగరాన్ని ఎంతో మంది అభివృద్ధి చేశారు.. కానీ ఈరోజు రాష్ట్ర ఆదాయానికే కీలకంగా మారిన సైబరాబాద్‌కు రేపటి భవిష్యత్ కోసం ఈనాడే పునాది వేశామన్నారు. నాడు హైటెక్ సిటీ వద్దన్నారు, ఓఆర్ఆర్ వద్దన్నారు, ఎయిర్ పోర్ట్ కూడా వద్దన్నారని గుర్తుచేశారు. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తున్నా.. తాము అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్.
►ALSO READ | ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీ ..అభివృద్ధిని అడ్డుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..:సీఎం రేవంత్
ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో టోక్యో, సింగపూర్‌లతో మన ఫ్యూచర్ సిటీ పోటీపడుతుందన్నారు..రాబోయే 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు. పెద్దరాక్షసుడు, పిల్లరాక్షసులు కలిసి... తెలంగాణ తలరాతను మార్చే ఫ్యూచర్ సిటీ ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కడుపునిండా విషం, కళ్లనిండా నిప్పులతో ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం. గుర్తుపెట్టుకోండి... ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వారికి ఈ రాష్ట్రంలోనే ఫ్యూచర్ లేదు! భవిష్యత్తును రద్దు చేస్తామంటే... మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు.
