న్యూఢిల్లీ: లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) ఆధారిత 'న్యారోబ్యాండ్ ఐఓటీ' (ఎన్‌బీఐఓటీ) సేవల్లో అనుభవం ఉన్న యూరోపియన్ శాటిలైట్ ఆపరేటర్ ‘సాటెలియోట్’ , ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక సబ్సిడరీని ఏర్పాటు చేసింది.
స్టార్‌లింక్ లాంటి సంస్థలు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌పై దృష్టి పెడితే, సాటెలియోట్ మాత్రం వ్యవసాయం, లాజిస్టిక్స్, మైనింగ్, స్మార్ట్ మీటర్ల వంటి రంగాలకు చెందిన ఐఓటీ పరికరాలకు తక్కువ ఖర్చుతో శాటిలైట్ కనెక్టివిటీని అందిస్తుంది. " వీడియోలు లాంటి గిగాబైట్ల డేటాను కాకుండా, కేవలం కొన్ని బైట్ల చిన్న డేటా సందేశాలను మాత్రమే మేము పంపుతాము. కాబట్టి బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ రూల్స్, రేట్లను ఐఓటీకి వర్తింపజేయొద్దు”అని సాటెలియోట్ రీజనల్ రెగ్యులేటరీ లీడ్ ఈథన్ ముదవన్‌హు ప్రభుత్వాన్ని కోరారు.
