కరీంనగర్లోని జ్యోతిష్మతి ఫస్టియర్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్..అందజేసిన విద్యాసంస్థల చైర్మన్ సాగర్ రావు

కరీంనగర్లోని జ్యోతిష్మతి ఫస్టియర్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్స్..అందజేసిన విద్యాసంస్థల చైర్మన్ సాగర్ రావు

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​లోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్) కాలేజీలో బీటెక్ ఫస్టియర్​లో జాయిన్ అయిన స్టూడెంట్స్​కు షాలిని విద్యాసంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు ఆదివారం స్కాలర్​షిప్ చెక్కులు అందజేశారు. మొత్తం 16 మంది విద్యార్థులకు రూ.18 వేల చొప్పున అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏటా రూ.18వేల చొప్పున నాలుగేండ్లకు మొత్తం రూ.72వేల స్కాలర్​షిప్ అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు షాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈ సహాయాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. పలు విద్యాసంస్థలు భారీ వ్యయంతో ప్రచారం చేస్తూ అడ్మిషన్లు చేయిస్తున్నాయని, కానీ తాము ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు వెళ్లకుండా ఆ వ్యయాన్ని విద్యార్థుల సంక్షేమానికే వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.