న్యూఢిల్లీ: దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. 4 కోట్ల ఫోలియోలు (ఫండ్ అకౌంట్స్) దాటిన మొదటి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ)గా నిలిచింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా (యాంఫీ) రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జూన్ చివరి నాటికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మొత్తం 27.86 కోట్ల ఫోలియోలు ఉండగా, ఇందులో 14.4శాతం వాటాను నిప్పాన్ ఇండియా కలిగి ఉంది.
అంతేకాకుండా, ఇండస్ట్రీలోని 6.19 కోట్ల మంది యూనిక్ ఇన్వెస్టర్లలో 39శాతం మంది (2.41 కోట్లు) ఈ ఫండ్ హౌస్‌తోనే ఉన్నారు. కుటుంబాల పొదుపులను భారత క్యాపిటల్ మార్కెట్లలోకి మళ్లించడంలో నిరంతరం కృషి చేస్తున్నామని ఈ బ్రాండ్ పేరెంట్ కంపెనీ నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ ఎండీ సందీప్ సిక్కా అన్నారు.
టాప్-5 ఫండ్ హౌస్‌ల ఫోలియోల వివరాలు:
1) నిప్పాన్ ఇండియా
మ్యూచువల్ ఫండ్: 4.02 కోట్లు
2) ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
మ్యూచువల్ ఫండ్: 3.18 కోట్లు
3)హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్: 3.11 కోట్లు
4) ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్: 2.24 కోట్లు
5) యుటీఐ మ్యూచువల్ ఫండ్: 1.42 కోట్లు
