మంచిర్యాల జిల్లా గెజిటెడ్ లెక్చరర్ల సంఘం ఎన్నిక

మంచిర్యాల జిల్లా గెజిటెడ్ లెక్చరర్ల సంఘం ఎన్నిక

లక్సెట్టిపేట వెలుగు: ప్రభుత్వ గెజిటెడ్ లెక్చరర్ల సంఘం(టీజీసీ జీటీఏ) మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. లక్సెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా మెరుపుటాల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన్నీరు సురేశ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి శ్రీధర హరీశ్ తెలిపారు. 

వివిధ యూనిట్లు అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు. లక్సెట్టిపేట యూనిట్ అధ్యక్షుడిగా సంతోష్ కుమార్, కార్యదర్శిగా జాడి శంకరయ్య, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడిగా గోపాలకృష్ణ, చెన్నూరు యూనిట్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రామకృష్ణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల బలోపేతానికి, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.