గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి నాలుగో పూజ ఘనంగా నిర్వహించారు. సెలవు దినం కావడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. భారీ తొట్టెలను అమ్మవారికి సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గోల్కొండ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ట్రాఫిక్ ఆంక్షల కారణంగా కోటకు కిలోమీటరు దూరంలోనే వాహనాలను నిలిపివేయడంతో భక్తులు నడిచేందుకు ఇబ్బందులు పడ్డారు. అన్నదాన సామగ్రిని కూడా వాహనాలపై అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెహిదీపట్నం, వెలుగు
