కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని సింగరేణి బొగ్గు గనులు, కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్లపై ఆదివారం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రాఫిక్ ట్రాన్స్ పోర్టేషన్(కోల్) ఆఫీసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ పర్యటించారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటీ సింగరేణి సీహెచ్పీలను సందర్శించి బొగ్గు సైడింగ్ విధానాన్ని తనిఖీ చేశారు.
బొగ్గు రవాణా రైల్వే రేక్‌ల కేటాయింపు, వినియోగం, లోడింగ్ తీరును పరిశీలించారు. సీహెచ్‌పీల్లో రైల్వే సైడింగ్నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. బొగ్గు లోడింగ్ ప్రక్రియను మరింత స్పీడప్ చేయాలని సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. శ్రీరాంపూర్ ఏరియా ఏస్వోటుజీఎం కృష్ణప్రసాద్, ఇంజనీర్ సురేశ్, సీహెచ్‌పీ ఇన్చార్జ్ చంద్రలింగం, డీజీఎం(సివిల్) ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
