నర్సాపూర్(జి), వెలుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామీణ రహదారులు అధ్వానంగా మారుతున్నాయి. ఆ రోడ్లపై ప్రయాణం ప్రజలకు నరకప్రాయంగా మారుతోంది. ముథోల్ నియోజకవర్గంలోని గొల్లమాడ, అంబకంటి, తిమ్మాపూర్, బురుపల్లి రోడ్లు పూర్తిగా గుంతలమయమయ్యాయి.
ఈ గ్రామాల నుంచి నిత్యం గర్భిణులు, రోగులు జిల్లా కేంద్రమైన నిర్మల్ వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్లను నిర్మించి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
