జై కృష్ణ ఘట్టనునేని, రాషా తరానీ జంటగా అజయ్ భూపతి రూపొందించిన చిత్రం 'శ్రీనివాస మంగాపురం' అశ్వినీదత్ సమ రణలో చందమామ కథలు బ్యానర్పై పి. కిరణ్ నిర్మించారు. జులై 30న సినిమా విడుదల కానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ ప్రెస్మిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జై కృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని విజువల్స్, ఆడియోలా యూనిక్‌గా ఉంటాయి. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆడియెన్స్ వంద శాతం ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమాలు చేసే నటుడిగా ఉండాలనేది నా లక్ష్యం. ఈ సినిమాతోనేను నిరూపించుకుంటానని నమ్ముతున్న" అని అన్నాడు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. జై కృష్ణ సూపర్ యాక్టర్ ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్లో తన పెర్ఫార్మెన్స్ చూశారు. మహేష్ బాబు గారి లాగా ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండిపోయే హీరో అవుతారు. ఇది చాలా పెద్ద సినిమా. తెలుగులో ఈ తరహా మేకింగ్తో సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, మేకింగ్ వాల్యూస్, విజువల్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద సినిమా అనే అనుభూతి కలుగుతుంది. మొదలైన పది నిమిషాలకే ప్రేక్షకులు ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు' అని చెప్పాడు. ఈ చిత్ర విజయంపై చాలా కాన్పిడెంట్‌గా ఉన్నామని నిర్మాత కిరణ్ అన్నారు. నటులు సరేష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ వద్దమాని సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
