నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇన్‌చార్జ్ ఎంఈవో బట్టు రాజేశ్వర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. టీచర్లకు బోధన మెళుకువలు నేర్పేందుకు ఇచ్చే ట్రైనింగ్ ఫండ్స్‌ను దుర్వినియోగం చేసినందుకు గాను సస్పెండ్అయ్యారు. బాల్కొండ జడ్పీ హైస్కూల్ గెజిటెడ్ హెచ్ఎం రాజేశ్వర్ ఇన్‌చార్జ్ ఎంఈవో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండలంలోని టీచర్స్‌కు ఈ నెల 13 నుంచి 15 దాకా శిక్షణ ఇచ్చారు. హాజరయ్యేవారికి ట్రైనింగ్ మెటీరియల్, బుక్స్ తదితర సామగ్రి సమకూర్చేందుకు ప్రభుత్వం నిధులు ఇచ్చింది.
కానీ వాటిని దుర్వినియోగం చేసిన రాజేశ్వర్.. స్కూల్ స్టూడెంట్స్ కోసం వచ్చిన నోట్ బుక్స్‌ను టీచర్స్‌కు పంపిణీ చేశారు. ఈ విషయాన్ని కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా డీఈవో అశోక్ విచారణ చేపట్టి ఆర్జేడీ మదన్‌మోహన్‌కు రిపోర్ట్ పంపగా ఆయన ఆదివారం సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేశారు.
