నదీ తీరాన
అలలను కలగంటూ
నిత్య ప్రవాహమైన మనసులో
సముద్రానికి చోటిచ్చే మనుషులుంటారు
నవ్వులన్నీ ఒడికట్టి
పువ్వులుగా విరాజిల్లీ
చందమామ లాంటి తమ చుట్టూ
చుక్కలుగా పేర్చుకునే మనుషులుంటారు
జీవితాల్ని చదువుతూ
గుండె గుండెను గుదిగుచ్చీ,
మానవత్వమనే పుస్తకానికి
ముఖచిత్రంగా నిలిచే మనుషులుంటారు
మనుషులైతే ఉంటారు
మనుషులను కలిసే మనసే ఉండాలి,
అలా అయితే..
ఆ అవసరమే లేకుండా
నిన్ను నువ్వు కలిసినట్టే!
- వినోద్ కుత్తుం
