కోయంబత్తూర్‎లో రామ్ చరణ్‎కు సర్జరీ.. ఏం జరిగిందంటే..?

కోయంబత్తూర్‎లో రామ్ చరణ్‎కు సర్జరీ.. ఏం జరిగిందంటే..?

రామ్ చరణ్ సోమవారం తమిళనాడు కోయంబత్తూర్లోని గంగా హాస్పిటల్లో మణికట్టు (విస్ట్) సర్జరీ చేయించుకోనున్నాడు. దీనికోసం చరణ్‎తో పాటు ఆయన తండ్రి చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన కూడా ఆదివారం కోయంబత్తూరు చేరుకున్నారు. పెద్ద చిత్రీకరణలో భాగంగా రామ్ చరణ్ మణికట్టుకు గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఈ సర్జరీ చేయించుకుంటున్నాడు. 

శస్త్రచికిత్స అనంతరం కొద్ది రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత రామ్ చరణ్ తిరిగి తన సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మరోవైపు రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ సుకుమార్ డైరెక్షన్లో చేయనున్నాడు. ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్ కెరీర్లో ఇది 17వ సినిమా కాగా, 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో ఇప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.