హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిటీ పరిధిలోని ఆర్సీపురం, పటాన్ చెరు, చందానగర్, శేరిలింగంపల్లి తోపాటు పలు ప్రాంతాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించింది. గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, మణికొండ, ఖాజాగూడ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మియాపూర్, కుకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడొచ్చని, రాత్రి 9గంటలనుంచి 11 మధ్య సిటీలో దక్షిణ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
►ALSO READ | హైకోర్టు తీర్పుతో యాక్షన్‌లోకి హైడ్రా.. సైబర్ టవర్స్ పక్కనే 3 వేల కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్
నిన్న కురిసిన వర్షానికి సిటీలో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ లతో సిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా వర్షాలు కురిస్తాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
