హైదరాబాద్ సిటీ పోలీసులతో చర్చించాకే నిర్ణయం: నటుడు నాని రిక్వెస్ట్ పై DGP సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ పోలీసులతో  చర్చించాకే నిర్ణయం: నటుడు నాని రిక్వెస్ట్ పై DGP సీవీ ఆనంద్

నటుడు నాని రిక్వెస్ట్ పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. గణేష్ నిమజ్జనం సందర్బంగా సిటీలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది.. గణేష్ నిమజ్జనం సందర్భంగా ముఖ్యంగా నిమజ్జన వాహనాలు, భక్తులతో ఆర్టీసీ క్రాస్ లో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అందువల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే హైదరాబాద్ సిటీ పోలీసుల అనుమతి చాలా కీలకం.సీటి పోలీసులతో చర్చలు జరిపాక ఓ నిర్ణయం తీసుకుంటామని  నటుడు నానీకి డీజీపీ సీవీ ఆనంద్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ ద్వారా రిప్లై ఇచ్చారు.

రిప్లైలో భాగంగా రెండే ళ్ల క్రితం ఆర్టీసీ క్రాస్ సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేశారు .ఆ ఘటనలో ఓ మహిళ, ఆమె కుమారుడు ఇద్దరు తీవ్రంగా పడ్డారు. చికిత్స పొందుతూ మహిళ చనిపోగా, చిన్నారికి శాశ్వత వైకల్యం ఏర్పడింది. ఈ ఘటనతో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృ ష్టి పెట్టింది పోలీసు యంత్రాంగం. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ సిటీ పోలీసులతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని డీజీపీ సీవీ ఆనంద్  స్పష్టం చేశారు.