కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని ముందే చెప్పాం: కేటీఆర్

కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని ముందే చెప్పాం: కేటీఆర్

తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమవుతుందని తాము ముందే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని ఆయన విమర్శించారు. గృహవసరాలు, పరిశ్రమలకే కాకుండా ప్రతి ఒక్క పనులకు కరెంట్ అత్యంత కీలకమని, ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమం కూడా కరెంట్ అంశంతోనే ప్రారంభమైందని కేటీఆర్ గుర్తుచేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సమస్యలపై టాప్ లెవల్ ఫోకస్ పెట్టామని, కేసీఆర్ అద్భుతమైన విద్యుత్ వ్యవస్థను రూపొందించడం వల్లే వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందించగలిగామని ఆయన పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ రావడం లేదని, కట్టిన ఇంటికి సున్నం వేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.

ALSO READ : ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు..?

రాష్ట్రంలో విద్యుత్ కోతలను ప్రభుత్వం ఎల్ నినో ఎఫెక్ట్ అని చెప్పడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ఎల్ నినో ఎఫెక్ట్ కాదు.. కాంగ్రెస్ అనే భూతం ప్రభావం" అని ఆయన విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై, కరెంట్ కోతలపై మరింత తీవ్రంగా పోరాటం చేసేందుకు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి పోరాటానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు.