ఆడదంటే అంత చులకనా? 'రూ.370 బిర్యానీ' తినిపించి సుఖం కోరుకుంటారా? సెలబ్రిటీస్ ఫైర్!

ఆడదంటే అంత చులకనా? 'రూ.370 బిర్యానీ' తినిపించి సుఖం కోరుకుంటారా? సెలబ్రిటీస్ ఫైర్!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే రచ్చ... అదే ' రూ.370 బిర్యానీ' కాంట్రవర్సీ. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ తినిపిస్తే, దానికి రిటర్న్ గిఫ్ట్‌గా అమ్మాయిని కోరుకోవచ్చా? అనే ఒక పచ్చి కామెంట్ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది . ఒక వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్, మరోవైపు ఉద్యోగం ఊడటం, ఇంకోవైపు దిశా పటానీ సిస్టర్ ఖుష్బూ పటానీ పదునైన కౌంటర్లు.. ఆడదంటే ఇంత  చులకనా అంటూ సెలబ్రిటీలు స్పందించడంతో ఈ విషయం నెట్టింట అగ్గి రాజేస్తోంది. 

ఆ ఒక్క మాటతో లైఫ్ రివర్స్..

స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోరే షోలో హిమాన్షు జాంగ్రా (23) అనే కుర్రాడు మైక్ అందుకుని, తను ఒక అమ్మాయితో డేట్‌కి వెళ్లి 'రూ370 చికెన్ బిర్యానీ' తినిపించానని, కాబట్టి తనకు ఆ ఇన్వెస్ట్‌మెంట్‌పై రిటర్న్స్ ఆశించే హక్కు ఉందంటూ పితూరీలు వాగాడు. దీనికి కమెడియన్ నవ్వడం, ఆడియన్స్ చప్పట్లు కొట్టడంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యి.. నెటిజన్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది.

 ఖుష్బూ పటానీ వార్నింగ్..

ఈ దారుణమైన కామెంట్స్‌పై బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా స్పందించారు. కేవలం 'రూ370 బిర్యానీ' తినిపించి, మొదటి రోజే ఆమెను ఆశించడం, చీకటి పార్కుకు తీసుకెళ్లడం ఏంటి? అబ్బాయిలు చెప్పే 'జస్ట్ ఫ్రెండ్స్' మాటకు అస్సలు విలువ లేదు అంటూ మండిపడ్డారు..

23 ఏళ్ల కుర్రాడి బుర్రలో ఇంత కుళ్లు ఉందా? అమ్మాయిలారా, చూశారా.. వీళ్లు మన రేటు డిసైడ్ చేస్తున్నారు. స్కూల్, కాలేజ్, డేటింగ్.. ఆఖరికి పెళ్లయ్యాక వరకట్నం రూపంలోనూ ఆడవారికి రేటు కడుతున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె సాంప్రదాయ నేపాలీ కత్తి 'ఖుకురి' (Khukuri) ని చూపిస్తూ.. అమ్మాయిలంతా ఇలాంటి వాటిని కొని దగ్గర పెట్టుకోవాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఉద్యోగం ఊడింది.. 

రచ్చ ముదరడంతో హిమాన్షు జాంగ్రా పనిచేస్తున్న 'స్టార్విక్ డిజైన్' సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఆఫీస్ వెలుపల జరిగినదైనా, మా కంపెనీ వాతావరణం, క్లయింట్స్ గౌరవం ముఖ్యం. అందుకే అతన్ని తీసేస్తున్నాం అని కంపెనీ ఫౌండర్ వివేక్ విశ్వకర్మ ప్రకటించారు. ఇటు నెటిజన్ల తిట్ల దెబ్బకు హిమాన్షు తన అకౌంట్స్ డిలీట్ చేయగా.. కమెడియన్ ప్రణీత్ మోరే కూడా తలవంచక తప్పలేదు. ఆడియన్ చేసిన కామెంట్లు నా అభిప్రాయాలు కావు. అప్పుడు నవ్వి వదిలేయడం నా తప్పే, క్షమించండి అంటూ సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు.

ALSO READ :  ఓటీటీలోకి మరో మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్‌ థ్రిల్లర్‌..