ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ ఓటీటీలో వచ్చే డిఫెరెంట్ కాన్సెప్ట్స్ వైపు లుక్కేస్తున్నారు. థియేటర్లో సాధారణంగా ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, రెండు కామెడీ ట్రాక్స్.. ఇలాంటి ఫార్మాట్‌లోనే చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది ఆనవాయితీగా వచ్చే కార్యక్రమం లెక్క అవే వస్తున్నాయి.. థియేటర్ అనుభూతి కోసం జనాలు కూడా అవే చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆడియన్స్ పాత పచ్చడి సినిమాలను వదిలేసి, కొత్త కథలపై ఇష్టం పెంచుకున్నారు. ఈ కారణంగానే చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
మిస్టికల్ థ్రిల్లర్స్ & వివిధ భాషల తెలుగు డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్స్తో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంచనాలు పెంచేస్తోంది. ముఖ్యంగా మిస్టరీ, థ్రిల్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో కూడిన వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఓటీటీలో విడుదలైతే వాటికి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళం థ్రిల్లర్ వస్తుంది. అదే ‘దృఢం’(Dridam).
మలయాళ యంగ్ హీరో షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ సమర్పించగా, మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ శుక్రవారం (జూన్ 12) నుంచి జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథలోని ఉత్కంఠభరితమైన మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గత నెల మే 8న కేరళ నాట థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకోవడమే కాకుండా ఉత్కంఠ రేకిత్తించింది. దీంతో ‘దృఢం’ ఓటీటీ విడుదలపై సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The start was easy but what comes next wasn’t!#Dridam streaming from June 12 on JioHotstar. #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama pic.twitter.com/zP3VYGnn2J
— JioHotstar Malayalam (@JioHotstarMal) June 10, 2026
‘దృఢం’ కథేంటంటే:
పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విజయ్ రాధాకృష్ణన్ (షేన్ నిగమ్) కొత్తగా ఓ ప్రశాంతమైన హిల్ స్టేషన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీపై వస్తాడు. మొదట్లో ఆ ప్రాంతం ఎంతో నిశ్శబ్దంగా, ఎలాంటి నేరాలు లేని ప్రాంతంలా కనిపిస్తుంది. అయితే విజయ్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
వరుస హత్యలు, దొంగతనాలు, బ్లాక్‌మెయిల్ కేసులు, భారీ బ్యాంక్ దోపిడీ వంటి ఘటనలు ఒకదాని వెంట ఒకటి చోటుచేసుకోవడంతో పోలీస్ శాఖ అప్రమత్తమవుతుంది. ఈ కేసులన్నింటి వెనుక ఏదైనా సంబంధం ఉందా? లేక వేర్వేరు నేరాలా? అనే కోణంలో విజయ్ తన బృందంతో కలిసి దర్యాప్తు ప్రారంభిస్తాడు.
కేసులు ముందుకు సాగుతున్న కొద్దీ మిస్టరీ మరింత సంక్లిష్టంగా మారుతుంది. నేరస్తుడి ఆచూకీ కనుగొనడం పోలీసులకు కత్తిమీద సాముగా మారుతుంది. ఒకవైపు బాధ్యతలు, మరోవైపు కేసులను ఛేదించాలనే ఒత్తిడి మధ్య విజయ్ తీవ్ర మానసిక సంఘర్షణను ఎదుర్కొంటాడు.
ALSO READ : అసలు పరీక్ష ఇప్పుడే..
ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో మొదలైన కథ, క్రమంగా ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రతి మలుపు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, అసలు నేరస్తుడు ఎవరు? ఈ వరుస నేరాల వెనుక ఉద్దేశం ఏమిటి? విజయ్ చివరకు ఈ కేసులను ఛేదించగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘దృఢం’ కోసం వెయిట్ చేయాల్సిందే.
