రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం ఢిల్లీ అంతటా పొగమంచు అలుముకుంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. లోధీ రోడ్ ప్రాంతంలో కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్నట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తోంది. పక్కనే ఉన్న హర్యానాలో పంటల వ్యర్థాలను తగలబెడుతుండడంతో… ఆ పొగ ఢిల్లీవైపు వస్తోంది. హర్యానాలోని ఫతేహాబాద్ ఏరియాలో పంటల వ్యర్థాలను భారీగా తగలబెడుతున్నారు. దీంతో ఆ పొగ, ధూళి ఢిల్లీ వైపు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా పొగలు వ్యాపిస్తున్నాయి.

