
‘బ్యాట్ మ్యాన్’గా డీసీ ఎక్స్‌టెండెడ్ యూనివర్స్‌లో మెప్పించిన బెన్ అఫ్లెక్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఎయిర్’. ఇదొక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. ఎయిటీస్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. బాస్కెట్ బాల్ షూ లైన్ ‘ఎయిర్’ జోర్డన్ కు సంబంధించిన కథ ఇది. ఇందులో నైకీ సంస్థకు మైఖేల్ జోర్డాన్‌కి మధ్య బిజినెస్ ఎండార్స్‌మెంట్ డీల్ ఎలా కుదిరింది.. ఎయిర్ జోర్డన్ బ్రాండ్ ఎలా క్రియేట్ అయిందనేది ఇందులో మెయిన్ కాన్సెప్ట్. తన కొడుకులో ఉన్న అద్భుత నైపుణ్యం గురించి ఏ మాత్రం రాజీపడని తల్లి, చరిత్రలో నిలిచిపోయిన దిగ్గజ బాస్కెట్ బాల్ ఆటగాడి స్టోరీ కూడా. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో విడుదలై మెప్పించిన ఈ చిత్రం.. ఈనెల 12 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవబోతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తోంది.