సేల్స్ పెంచుకునేందుకు కొన్ని మార్కెటింగ్ సంస్థలు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తాయి. ఇప్పుడు విమానయాన సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సేవల సంస్థ ఎయిర్ ఆసియా ఓ ఆఫర్ ను ఇచ్చింది. అదికూడా దేశ వ్యాప్తంగా వివిధ నగరాల నుంచి రాజధాని న్యూఢిల్లీకి వెళ్లే ప్రయాణికులకు మాత్రమే.
ఢిల్లీలోతీవ్రంగా కాలుష్యం పెరగడంతో… ప్రతి ప్రయాణికుడికీ, యాంటీ పొల్యూషన్ మాస్క్ ను ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్ కతా నగరాల నుంచి ఢిల్లీకి వచ్చే వారికి వీటిని అందిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు. 29వ తేదీ వరకూ వీటిని ఫ్రీగా అందిస్తామని, దీంతో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతినకుండా ఉంటాయన్నారు. హెల్త్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థ ఎంఫిన్ తో కలిసి ఈ మాస్క్ లను తాము అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

